రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారు: అయ్యన్న పాత్రుడు

by srinivas |
రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారు: అయ్యన్న పాత్రుడు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర భవిష్యత్తును సీఎం జగన్ నాశనం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. 18 నెలలు అవుతున్నా ఇసుక పాలసీని ఇంకా తీసుకురాలేదని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. ఖాళీ స్థలాలపై పన్ను, ఆస్తి పన్ను వైసీపీ ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు. ప్రజల డబ్బుతో విగ్రహాలు కడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

Advertisement

Next Story