రేపు ఏలూరుకు వెళ్లనున్న సీఎం జగన్..

by srinivas |   ( Updated:2020-12-06 23:34:59.0  )
రేపు ఏలూరుకు వెళ్లనున్న సీఎం జగన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లాలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ సోమవారం ఉదయం ఏలూరుకు వెళ్లనున్నారు.రేపు ఉదయం 9గంటల ప్రాంతంలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.ఈ నేపథ్యంలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిని జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. వింత వ్యాధి బారిన పడిన వారిని పరామర్శించిన అనంతరం అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు 227మంది వైద్యులకే అంతుచిక్కని వ్యాధి బారిన పడినట్లు సమాచారం. అయితే, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story