ఈ సంఘటన దురదృష్టకరం: ఢిల్లీ సీఎం

by Shamantha N |
ఈ సంఘటన దురదృష్టకరం: ఢిల్లీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో సంచలనం రేపిన కొవిడ్ పేషంట్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఘటన రోజు రోజుకీ ముదురుతోంది. ఏకంగా కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగడంతో మరింత వివాదాస్పదమైంది. జూన్ 15న ఢిల్లీ చత్తార్‌పూర్‌లోని అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న బాలిక బాత్‌ రూమ్ వెళ్లిన సమయంలో ఓ యువకుడు బాధితురాలిపై లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed