కలుగులో ఎలుకలా దాక్కున్న ముఖ్యమంత్రి

by  |
కలుగులో ఎలుకలా దాక్కున్న ముఖ్యమంత్రి
X

దిశ, నల్లగొండ: కరోనాతో తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతుంటే, ముఖ్యమంత్రి మాత్రం కలుగులో ఎలుక దాక్కున్నాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్ర ఆగ్రహంతో విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క సారథ్యంలోని సీఎల్పీ బృందం మంగళవారం నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించింది. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ… కరోనాను కట్టడి చేయడంలో విఫలం చెందిన కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తిగా చేతులు ఎత్తేసిందని విమర్శించారు. ఉద్యమమంతా ఉద్యోగాల కోసమే అని చెప్పిన వైద్య మంత్రి ఈటల రాజేంద్ర ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

ఇతర శాఖల సంగతి పక్కన పెడితే ఒక్క వైద్య శాఖలో వేలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఈ ఆసుపత్రిలో ఎవరైనా వైద్యం చేయించుకుంటారా అన్నారు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 375 మంది డాక్టర్లు ఉండాల్సిఉండగా 361 పోస్టులు ఖాళీగా ఉన్నాయని భట్టి విక్రమార్క లెక్కలతో సహా వివరించారు.నర్సుల కొరత జిల్లా ఆసుపత్రిలో 309 నర్సింగ్ పోస్టులు ఉంటే మొత్తం ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఆసుపత్రులు, దేవుళ్ళులేని దేవాలయలుగా మారిపోయాయని భట్టి మండిపడ్డారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, కనీసం ఆస్పత్రులపై శ్రద్ధ చూపలేదన్నారు. ఇంత దుర్మార్గమైన పాలన స్వతంత్ర భారతదేశంలో మరెక్కడా లేదన్నారు. పేదల కోసం పని చేస్తాం అని చెప్పుకునే జిల్లా మంత్రికి, సిగ్గుంటే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ని పోస్టులు ఖాళీగా పెట్టిన మిమ్మల్ని ప్రజలు ఏమి చేసినా పాపం లేదని అన్నారు.

కరోనా వచ్చి ప్రజలు కరోనా పిట్టల్లారాలిపోతుంటే.. కేసీఆర్ ఏమీ పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారన్నారు. కరోనా వస్తుంది, అత్యంత ప్రమాదకరంగా మారుతుందని అసెంబ్లీలో సీఎల్పీ చెబితే ఒక జోకర్‌లా కేసీఆర్ మాట్లాడారని అన్నారు. కేసీఆర్ పాలనలో కొత్త నీళ్ల సంగతి దేవుదేరుగు ఉన్న నీళ్లు కూడా పోయే పరిస్థితి వెచ్చిందన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో దక్షిణ తెలంగాణ పూర్తిగా నష్టపోతుందన్నారు. రోజుకు 3 టీఎంసీల చొప్పున ఏపీ తీసుకుపోతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే తెలంగాణలో మొత్తం 27 లక్షల ఎకరాల ఎండిపోతాయన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ఆయనతో పాటు నల్గొండ డీసీపీ అధ్యక్షుడు శంకర్ నాయక్, టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed