- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఏడారే’
దిశ, న్యూస్ బ్యూరో : ఏపీ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టడం, కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం అంశాలను అజెండాగా తీసుకుని ఆదివారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది.
సీఎల్పీ భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత అవసరాల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణను తాకట్టుపెడుతున్నారని, కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని, ఢిల్లీకి కాంగ్రెస్ ప్రతినిధి బృందం వెళ్లనుందని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడుల, హత్యలపై సోషల్ జస్టిస్ శాఖ మంత్రిని కలుస్తామని, అలాగే రాష్ట్రపతికి, ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని భట్టీ వెల్లడించారు.