- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
దిశ, ముదిగొండ : బీజేపీ చెప్పిందే కేసీఆర్ చేస్తున్నారంటూ.. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్, ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటి వీరు ఢిల్లీ వెళ్లి వానాకాలం పండిన పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటి పై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లాలో వరి సాగు పైనే ఆధారపడి రైతులు జీవిస్తున్నారు. వేరే పంటలు సాగు చేస్తే నష్ట పోతున్నారు. ఇప్పటికే మిర్చి, పత్తి పంట సాగు చేసిన రైతులు నష్టపోయారు, వాటికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. యాసంగిలో పంట కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కలెక్టర్ యాసంగిలో వరి వేయొద్దని చెబుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనుగోలు చేయాలని కోరడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. జిల్లా మంత్రి ఇప్పటివరకు యాసంగి వరి పంట సాగుపై మాట్లాడకుండా అధికారులతో మాట్లాడిస్తున్నారని, రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు,బాబు తదితరులు పాల్గొన్నారు.