- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక ద్రోహి… మరో ద్రోహితో కలిసి కబ్జా
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఒక ద్రోహి మరో ద్రోహితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు మండిపడ్డాడు. మణుగూరులో కాంగ్రెస్ కార్యాలయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు రాత్రికి రాత్రి రంగులు మార్చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరులో కాంగ్రెస్ నాయకుల చేపట్టిన నిరాహార దీక్షలో భట్టి పాల్గొని మాట్లాడుతూ..
ఎక్కడో టీచర్‌గా పని చేస్తున్న రేగా కాంతారావును.. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి ఎమ్మెల్యేను చేస్తే.. పార్టీ ఫిరాయించి పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. మణుగూరు చేరుకున్న కాంగ్రెస్ నాయకుల బృందం ముందుగా మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామిని కలుసుకున్నారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో శాఖ పరంగా సహకరించాలని కోరారు. అయితే పార్టీ కార్యాలయ వివాదంపై నేనేం చేయలేను.. నా మీద అధికార పార్టీ ఒత్తిడి తీవ్రంగా.. ఉందని మున్సిపల్ కమిషనర్.. వెంకటస్వామి తెలిపారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రికార్డులు నా వద్ద లేవు.. గతంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో రికార్డులను ఉన్నాతిధికారులు తీసుకెళ్లారంటూ వ్యాఖ్యనించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.