కరోనాను అరికట్టడంలో సర్కార్ విఫలం

దిశ, భువనగిరి: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రభుత్వాసుపత్రిని భట్టి సందర్శించి, కరోనా పేషెంట్లతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌కు కుడి భుజం, నమ్మిన బంటుగా పేరున్న మంత్రి జగదీష్ రెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు, సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం పేరుతో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని గద్దెనెక్కిన సీఎం, కబుర్లతో కాలంగడుపు తున్నారని విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలాగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

Advertisement