రెవె‘న్యూ’ బిల్లుపై అసెంబ్లీలో చర్చ..

by Shyam |   ( Updated:2020-09-11 03:21:17.0  )
రెవె‘న్యూ’ బిల్లుపై అసెంబ్లీలో చర్చ..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లుపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్ధ రద్దు, ధరణి పోర్టల్ కు సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ జవాబులు చెప్పారు.

1. కొత్త చట్టానికి బదులు ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థనే కొనసాగించాలని భట్టి విక్రమార్క కోరగా.. VRO వ్యవస్థ మినహా రెవెన్యూ యంత్రాంగం మొత్తం అలాగే ఉంటుందని సీఎం తెలిపారు. కొత్త చట్టంలో అంశాలు బ్రాడ్ గా ఉంటాయని, దానికి అనుగుణంగా VROల స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

2. సమగ్రమైన భూ సర్వేలు చేయకపోతే సమస్యలు అలాగే ఉంటాయని, ధరణి పోర్టల్ కూడా ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించాలని భట్టి కోరారు. అదేవిధంగా రికార్డులను మాన్యువల్ గా ఉంచుతారా..? ఒకవేళ డిజిటల్ రూపంలో భద్రపరిస్తే.. ఆ సాఫ్ట్ వేర్‌ను ఎవరైనా హ్యాక్ చేస్తే పరిస్థితి ఎంటనీ ప్రశ్నించారు.

దీనిపై సీఎం సమాధానమిస్తూ.. భూమికి సంబంధించిన సమస్యలను ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ పెట్టి పెండింగ్ కేసులను పరిష్కరిస్తామన్నారు. కేసుల పరిష్కారం తర్వాత ట్రిబ్యునల్స్ ఉండవని కేసీఆర్ స్పష్టంచేశారు.

3. కేసుల పరిష్కారం తర్వాత కూడా సమస్యలు ఎదురైతే.. వాటి పరిష్కారం కష్టమని.. ఆ కేసులు ఒక తరం వరకు కోర్టుల దగ్గర పెండింగ్‌లో ఉంటాయని భట్టి ప్రశ్నించారు. అందుకే ధరణి పోర్టల్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థను కొనసాగించాలని పునరుద్ఘాటించారు. అలాగే ఆర్డీవో, జేసీ కోర్టులను కొనసాగించాలని భట్టి విక్రమార్క సూచించారు.

Advertisement

Next Story

Most Viewed