- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ భజనలో ఎమ్మెల్యేలు నిమగ్నం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో సరైన వైద్య సిబ్బంది లేరని, ప్రశ్నించిన వారిని గెంటేయడానికి సెక్యూరిటీని మాత్రం నియమించుకుంటున్నారని విమర్శించారు.
‘ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు, శరం లేదని, బుద్ధీ జ్ఞానం ఉన్నా పాలకులు ఐతే కరోనా విజృంభణకు ముందే అప్రమత్తం అయ్యే వారని ఎద్దేవా చేశారు. కరోనాపై సీఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించకుండా, ఫామ్‌హౌస్‌కే పరిమితం అయితే, మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ భజనలో నిమగ్నం అయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల నియామకాలు చేసి, కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.