ఐటీఐఆర్‌‌కు కృషి చేసిందే కాంగ్రెస్సే : భట్టి

by Shyam |
CLP leader Bhatti Vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ఐటీఐఆర్ కేటాయించేలా కాంగ్రెస్ కృషి చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, డ్రామాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కేంద్రాన్ని అడగలేదన్నారు. ఐటీఐఆర్ వస్తే రాష్ర్టంలోని దాదాపు 65 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి ఈ నెల 9 నుంచి మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్స్‌లో ప్రచారం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల బాగోగులపై బీజేపీ, టీఆర్ఎస్‌కు ఆలోచన లేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులపై ఆ పార్టీలు దొంగ ప్రేమను చూపిస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని మంత్రులు బయపడుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్‌కు ఓట్లు వేయకుంటే ప్రభుత్వ పథకాలు అందవని ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వాలు అభివృద్ధే తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. సరైన పాలన లేకపోవడంతోనే ర్యాంకు పడిపోయిందన్నారు. పవర్ కట్‌పై మేయర్ రాసిన లేఖలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed