‘కేసీఆర్ మొద్దు నిద్ర మానాలి’

దిశ, నల్గొండ: కరోనా విపత్కర సమయంలో కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పర్యటనలో భాగంగా.. బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలోని కరోనా బాధితులను పరామర్శించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు.

సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి అసలు ఉన్నారా లేదా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే ఏం చేస్తున్నారన్నారు. పేదల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు. అటు జిల్లా ఆస్పత్రుల్లో సరైన వసతులు లేవన్నారు. వెంటనే సరిపడు సిబ్బంది, మౌలిక వసతులను కల్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Advertisement