- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్దాలుగా గబ్బిలాల్లో కరోనా వైరస్
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నిజంగానే చైనా ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందా? కరోనా వైరస్ పాములను తినడం వల్లే మనుషులకు వ్యాప్తి చెందిందా? అలుగులు కూడా కరోనాకు కారణమేనా? వైరస్ మూలాలు గబ్బిలాల్లో ఉన్నాయా? ఇలా సగటు మానవుని బుర్రలో ఎన్నో ప్రశ్నలు ? మరెన్నో సందేహాలు? అయితే వీటికి సమాధానం తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందాన్ని చైనాకు పంపించిన విషయం తెలిసిందే. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు కూడా పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. చైనీయులు గబ్బిలాలు తినడం వల్లే కొవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి జరిగినట్లు చాలా మంది పరిశోధకులు భావించినట్లే.. తాజా అధ్యయనం దాన్ని బలపరుస్తుంది.
గబ్బిలాల్లోనే కరోనా వైరస్ కొన్ని దశాబ్దాలుగా గుర్తించకుండా ఉంటున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్స్ షూ గబ్బిలాలు సార్స్ కోవ్-2తో పాటు మరో 67 వైరస్‌లకు గబ్బిలాలే మూలమని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన ప్రొఫెసర్ మాసిజ్ బోని నేతృత్వంలోని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనం నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే, ఇంతకుముందు భావించినట్లు గబ్బిలాలనుంచి పాంగోలిన్ల(అలుగు)కు వైరస్ సోకి, వాటి నుంచి మానవులకు వ్యాపించిందనే దానికి ఆధారాలు లభించలేవని తెలిపారు. అలుగులు వైరస్‌కు వాహకంగా పనిచేయడం లేదని కనుగొన్నట్లు చెప్పారు. ఈ పాంగోలిన్లకు మాత్రం గబ్బిలాల ద్వారా వైరస్ సోకి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు.
సార్స్ కోవ్ 2 జన్యుక్రమంలో వచ్చిన మార్పుల ఆధారంగా జన్మించలేదని , ఇప్పటి వరకు ఉన్నటువంటి కరోనా వైరస్‌లతో కంబైన్డ్ కావడం వల్లే ఇది పుట్టుకొచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 1948 నుంచి 1982 వరకు ఉన్న 68 రకాల కరోనా వైరస్‌లే సార్స్ కొవిడ్ 2 ఉద్భవించడానికి కారణమనుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాలు ఈ వైరస్‌లు ఉంటున్నాయని వారు తేల్చారు. ‘వైరస్ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.