- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి సెప్టెంబర్ 1నుంచి తరగతులు..
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతుండటంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన అకాడమిక్ ఇయర్ వాయిదా పడుతూవస్తోంది. అయితే, ఈ విద్యా సంవత్సరం(2020-21) ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతికత విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రణాళికలు సిద్దం చేసింది.
మేరకు నూతన అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి రెండు, మూడు, నాలుగు ఏడాది విద్యార్ధులకు తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ పద్దతిలో సీనియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఏఐసీటీఈ (AICTE) స్పష్టం చేసింది. అదేవిధంగా బీటెక్, బీఫార్మసీ, పీజీ ఫస్టియర్ తరగతులను నవంబర్ 1 నుంచి ప్రారంభించాలని తెలిపింది. అయితే కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని వివరించింది.
అటు ప్రైవేటు కాలేజీల గుర్తింపు గడువు సెప్టెంబర్ 15వ తేదీగా ఖరారు చేసింది. ఇక అక్టోబర్ 20 నాటికి ఫస్టియర్ విద్యార్ధులకు మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తవుతుందని.. అలాగే నవంబర్ 1 నాటికి రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేయాలని ప్రకటించింది. ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్ధులు ప్రవేశానికి నవంబర్ 15ను తుది గడువుగా పేర్కొంది. కాగా, వాస్తవానికి అక్టోబర్ 15నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది.