వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ

దిశ వెబ్ డెస్క్:
కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గన్నవరం నియోజక వర్గంలో ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వర్గాలు బాహాబాహికి దిగాయి. కాగా ఓ చెరువుకు సంబంధించిన విషయంలో ఘర్షణ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. చివుటపల్లి అనే గ్రామంలో ఓ చెరువును యార్లగడ్డ మేనల్లుడు వినయ్ లీజుకు తీసుకున్నారు. అయితే చెరువు విషయంలో ఎమ్మెల్యే వంశీ అనుచరుడు దుర్గారావుతో వివాదం మొదలైనట్టు సమచారం. ఈ నేపథ్యంలో వంశీ, యార్లగడ్డ వర్గాలు తలపడ్డట్టు తెలుస్తోంది. ఘర్షణపై ఇరు వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. కాగా కేసు విషయం తెలియడంతో యార్లగడ్డ వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తన అనుచరులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను కోరారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

Advertisement