నడిరోడ్డుపై తన్నుకున్న వైసీపీ నేతలు

by srinivas |
నడిరోడ్డుపై తన్నుకున్న వైసీపీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయాలు మరోసారి ఘర్షణకు దారి తీశాయి. మాట మాట అనుకున్న నేతలు రోడ్డుపైనే తన్నుకున్నారు. శనివారం గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇదేక్రమంలో వైసీపీలోని నేతల మధ్య మనస్పర్థలు బయట పడటంతో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు గొడవ పడుతున్నవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ఇస్తున్నప్పటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం ఇది మూడోసారి.

Advertisement

Next Story

Most Viewed