వైసీపీలో తన్నులాట

by Anukaran |   ( Updated:2020-07-11 06:18:33.0  )
వైసీపీలో తన్నులాట
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా వైసీపీలో వర్గపోరు.. ఒకరిపై ఒకరు పరోక్షంగా భౌతిక దాడులు చేసుకునే వరకు వచ్చింది. అముదాలవలస మండలంలో స్పీకర్ తమ్మినేని సీతారాం రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తమ్మినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో వైసీపీ నాయకులు కలుగజేసుకొని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఇటీవల స్పీకర్ ఓ కార్యక్రమంలో హాజరై వెళ్లినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story