- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్రిక్తత.. TRS, BJP నేతల మధ్య బాహాబాహీ.. వీడియో
దిశ, జమ్మికుంట : దళిత బంధు ఆగిపోవడానికి బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కారణమంటూ ఆయన దిష్టిబొమ్మను టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. అందుకు నిరసనగా బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో జరిగింది.
వివరాల ప్రకారం.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధును కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఈటల రాజేందరే అంటూ.. ఆయన దిష్టిబొమ్మను టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య బాహాబాహితో పాటు తోపులాట చోటు చేసుకుంది. దీంతో, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.