నేడు AP, TS బస్సు సర్వీసులపై స్పష్టత 

దిశ, వెబ్ డెస్క్ : అన్ లాక్ 4.0 లో భాగంగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు కేంద్రం అనుమతినిచ్చినా… ఏపీ, తెలంగాణ బస్సు సర్వీసుల పునరుద్ధరణపై స్పష్టత రాలేదు.రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదు.

ఈ నేపథ్యంలో మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్ బస్ భవన్ లో మరోసారి సమావేశం కానున్నారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై మరోసారి చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో  బస్సులు తిప్పాల్సిన కిలోమీటర్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు.

Advertisement