ఆగస్టు 2న సివిల్స్-2020 ఇంటర్వ్యూలు

by Harish |   ( Updated:2021-06-10 02:50:33.0  )
ఆగస్టు 2న సివిల్స్-2020 ఇంటర్వ్యూలు
X

దిశ, వెబ్‌డెస్క్: సివిల్ సర్వీసెస్ 2020 ఇంటర్వ్యూలను ఆగస్టు 2 నుంచి నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. యూపీఎస్సీ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రిలిమ్స్, మెయిన్స్‌ సమయానుగుణంగా జరిగాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పరిస్థితిని సమీక్షించిన యూపీఎస్సీ ఆగస్టు 2 నుంచి సివిల్ సర్వీసెస్-2020 ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది. అతి త్వరలో ఇంటర్వ్యూ లెటర్స్‌ను అభ్యర్థులకు పంపనున్నట్లు పేర్కొన్నది.

Advertisement

Next Story