వలస కార్మికులకు సీఐటీయూ తోడ్పాటు

by Shyam |   ( Updated:2020-04-13 08:53:04.0  )
వలస కార్మికులకు సీఐటీయూ తోడ్పాటు
X

దిశ, మెదక్: బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి సీఐటీయూ అండగా నిలిచింది. సోమవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్‌పల్లి మండలం అంగన్ వాడీ యూనియన్ ఆధ్వర్యంలో కాటన్ మిల్లు వలస కార్మికులకు సీఐటీయూ నాయకులు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. అందుకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో కాటన్ మిల్లు వలస కార్మికులకు బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు అందజేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కాటన్ మిల్లు వలస కార్మికులు పాల్గొన్నారు.

tags: corona, lockdown, migrant labourers, citu, necessities


Next Story