ఆటోకు తాళి కట్టి.. తాళ్లతో లాగి

by  |
ఆటోకు తాళి కట్టి.. తాళ్లతో లాగి
X

దిశ, నల్లగొండ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా, కరోనా కష్టకాలంలోనూ ఏమాత్రం కనికరం లేకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారం మోపుతోందని సీఐటీయూ నాయకులు మల్లేశం కేంద్రాన్ని విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఆటోకు తాళి కట్టి తాళ్లతో లాగి నిరసన తెలిపారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ.. లాక్‌‌డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్న ప్రస్తుత సమయంలో, పన్నుల పేరుతో ప్రభుత్వ ఖజానాను నింపుకుంటూ, మరోవైపు కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు.


Next Story

Most Viewed