రైళ్ల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆందోళన

by Shyam |
రైళ్ల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆందోళన
X

దిశ, సికింద్రాబాద్: రైల్వేల ప్రైవేటీకరణ నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేపట్టోదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం ఆరు రైల్వేస్టేషన్లను ప్రైవేట్ పరంచేస్తూ సంబంధించిన రూట్లలో ప్రైవేట్ ట్రైన్ నడపడం అంబానీకి ఆస్తులు సంపాదించి పెట్టడమేనని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, నగర అధ్యక్షుడు ఈశ్వరరావు, సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి ఆర్ మల్లేష్, మారస్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed