- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మిక లోకానికి దిక్సూచి సీఐటీయూ
దిశ, ఖమ్మం: భారత కార్మిక వర్గానికి సీఐటీయూ దిక్సూచిగా నిలిచిందని ఖమ్మం జిల్లా సీఐటీయూ కోశాధికారి మాచర్ల గోపాల్ అన్నారు. సీఐటీయూ స్వర్ణోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఖమ్మంలోని ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. అనంతరం గోపాల్ ప్రసంగిస్తూ.. సీఐటీయూ ఆవిర్భావం తర్వాత భారత కార్మిక వర్గం అనేక సమరశీల పోరాటాలు నిర్వహించి విజయాలను సాధించిందన్నారు. స్టాఫ్ &వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గడ్డం లింగమూర్తి మాట్లాడుతూ.. కరోనా కష్టాల్లో విదేశీ, స్వదేశీ బడా వ్యాపార సంస్థలకు అనుగుణంగా కార్మిక చట్టాలను మార్చే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ కోశాధికారి పర్వీనా, గుండు మాధవరావు, గుగ్గిళ్ల రోశయ్య, పగిళ్ల పల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.