- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళ్లరిగేలా కూలీల ప్రదక్షిణలు.. న్యాయం చేయాలని వేడ్కోలు
దిశ, చింతకాని: మండలంలో చిన్నమండవ గ్రామంలో నుండి ఇసుక రవాణ కోసం 2 సంవత్సరాలనుండి కూపన్ లు మంజూరు చేస్తున్నారు. కూపన్ లలో కొన్నింటిని వక్రమార్గంలో మంజూరు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా మంజూరు చేసిన కూపన్ ల డబ్బులు అధికారికంగా అనాధికారికంగా కూపన్ లకు తీసినటువంటి డీడీ డబ్బులు సుమారు కోటి పది లక్షల రూపాయలు. కూపన్ కు రూ.1060. వాటిలో రూ.400 పంచాయతీకి ,రూ.400 కూలీలకు రూ.100 మండల పరిషత్ కార్యాలయంకి, రూ.100 జిల్లా పరిషత్ కార్యాలయంకు, మిగిలిన 60 రూపాయలు ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చుకు చేయ్యాల్సి ఉంది.
అధికారులు మాత్రం కేవలం 64 లక్షల 50 వేల రూపాయలు ఉన్నాయి అని చెబుతున్నారు. మిగిలిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు నుండి ఇసుక రవాణా చేసేందుకు అధికారులు సుమారు 12 వేల కూపన్లు మాత్రమే డీడీ లు తీసుకోవడం జరిగిందని, వాటికి మాత్రమే డబ్బులు లెక్కలు చెబుతున్నారని మిగిలిన డబ్బులు ఏమీ అయ్యయో అర్థం కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులను చిన్న మండవ గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని, మీరు చేసుకునేది ఏంటో చేసుకో అంటూ కొందరు బడా నాయకులు అనేక రకాలుగా మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రతిరోజు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్తే ఇక్కడ ఏమీ లేదని ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్ళమని చెబుతున్నారని, అక్కడి నుండి ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్తే తహసిల్దార్ కార్యాలయం కు వెళ్ళమని మమ్మల్ని తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఓ అధికారి మీకు డబ్బులు ఇవ్వడం ఖాయం అని నేను ఏది చేసినా మీకు డబ్బులు ఇప్పించే వరకు ఇప్పిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెబుతూనే మరోవైపు చేయాల్సినవి చేస్తున్నారని చెబుతున్నారు. కనీసం ఆఫీస్ కి వెళ్తే పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన ప్రతిఫలాన్ని అందించాలని కూలీలు కోరుతున్నారు.