పోలీసులతో సంబంధాలు ఉపయోగమే : రాజిరెడ్డి

by Shyam |   ( Updated:2021-10-09 07:06:20.0  )
Circle Inspector Raji Reddy
X

దిశ, కొత్తగూడ: యువత ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా ఆత్మవిశ్వాసంతో సన్మార్గంలో నడవాలని గూడూరు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రాజిరెడ్డి అన్నారు. అక్టోబర్ 21న జరగనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడ మండల కేంద్రంలో క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. గ్రామీణ యువత ఇదొక అవకాశంగా తీసుకోవాలన్నారు. క్రీడాస్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థానం సంపాదించాలన్నారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి మండలానికి గుర్తింపు తీసుకురావాలన్నారు.

క్రీడా రంగంలో రానిస్తే భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడొచ్చన్నారు. క్రీడాకారులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. ఈ క్రీడల నిర్వహణ వల్ల యువతకు పోలీసులతో సత్సంబంధాలు ఏర్పడుతాయన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు గమనించినా తక్షణమే డయల్ 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ ఎస్‌ఐ సురేష్, ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు వజ్జ సురేందర్, ఉమ్మడి కొత్తగూడ మండల క్రీడా అధ్యక్షులు సిద్దబోయిన వెంకన్న, వైస్ ప్రెసిడెంట్ కొమ్మాలు, వ్యాయామ ఉపాధ్యాయులు వట్టం వెంకట్, మేడ ప్రవీణ్, ఈసం నాగేశ్వరరావు, శంకర్ బుర్కా మహేందర్, బంగారి నరేష్, దనుసరి సుధాకర్, ఫుల్ సింగ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed