- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Abdhameva Jayate: కొత్త నటీనటులతో చెయ్యడం చాలా సంతోషంగా ఉంది.. అబద్ధమేవ జయతేపై యంగ్ హీరో కామెంట్స్

దిశ, సినిమా: సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటి స్తున్న తాజా చిత్రం ‘అబద్ధమేవ జయతే’ (Abadhameva Jayate). కె. కార్తికేయన్ సంతోష్ (K. Karthikeyan Santosh) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ (Village Back Drop)లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. ఈ క్రమంలోనే సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. తాజాగా ది అదర్ స్టోరీ ఆఫ్ అబద్ధమేవ జయతే ఫస్ట్ లుక్‌ని యంగ్ హీరో మహేంద్రన్ (Mahendran) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలా మంది కొత్త నటీనటులతో సినిమా రూపొందించినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా ఫస్ట్‌లుక్ అండ్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. పెద్ద స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పి మూవీ టీమ్‌ను అభినందించారు. కాగా.. ఈ చిత్రం స్త్రీలు ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యలు అండ్ గర్భం విఫలమైన తర్వాత వారికి సరైన చికిత్స చేయకపోతే దాని పర్యవసానాలను వివరిస్తుందని చిత్ర బృందం ఇప్పటికే తెలిపారు.