థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..

by Kavitha |   ( Updated:2025-02-22 13:45:25.0  )
థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న ఎవడే సుబ్రహ్మణ్యం.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అష్టా చమ్మా’(Ashta Chemma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో తన నేచురల్ యాక్టింగ్‌‌తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. నాని, కీర్తి సురేష్(Keerthi Suresh) జంటగా నటించిన ‘దసరా’(Dasara) మూవీకి అయితే ఏకంగా అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం నాని టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అయితే నాని హీరోగా కాకుండా ప్రజెంట్ ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా చేస్తున్న సినిమాల్లో ‘హిట్-3’(Hit-3) ఒకటి. అండ్ మరొకటి శ్రీకాంత్ ఒదెల(Srikanth Odela) సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే హిట్3 మూవీలో హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.

ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అంజనా ఎలవర్తిని(Anjana Yelavarthi) పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంటకు ఒక బాబు ఉన్నాడు. ఇదిలా ఉంటే..నాని హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) ఫస్ట్ టైం దర్శకత్వం వహించిన సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’(Yevade Subramanyam). ఇక ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రియాంక దత్(Priyanka Dutt) నిర్మించారు. ఇకఈ సినిమాలో మాళవిక(Malavika) హీరోయిన్‌గా నటించగా.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కీ రోల్ ప్లే చేశారు.

కాగాఈ చిత్రం మార్చి 21 2015లో విడుదలై మంచి విజయం సాధించింది. అంతేకాకుండా ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ అయి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు వైజయంతి మూవీస్ అఫీషియల్‌గా ప్రకటించింది.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ఒక దశాబ్దం తర్వాత... దూద్ కాసి మమ్మల్ని మళ్లీ పిలుస్తాడు’ అని హార్ట్ సింబల్‌ను జోడించింది. కాగా ఈ మూవీ మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.



Next Story

Most Viewed