- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chinmayi: మహిళలకు ఎక్కడా రక్షణ లేదు.. ఇంట్లోనూ వేధించే వారుండొచ్చంటూ చిన్మయి సంచలన పోస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్ చిన్మయి(Chinmayi Sripada) పలు సాంగ్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సినిమాల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు డబ్బింగ్ చెప్పి తన వాయిస్‌తో అందరినీ మంత్రముగ్దులను చేయడంతో పాటు ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆమె డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్ర(Rahul Ravindra)ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు (ట్విన్స్) ఉన్నారు. ఇదిలా ఉంటే.. చిన్మయి సాంగ్స్‌ను కోలీవుడ్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వైరముత్తు తనని వేధింపులకు గురి చేశాడని అప్పట్లో చిన్మయి పెట్టిన పోస్ట్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అప్పటి నుంచి ఆమె తెలుగులోనూ పెద్దగా పాటలు పాడటం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ జరిగే సంఘటన గురించి తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక్కోసారి చిన్మయి పెట్టే పోస్టులు ఆలోచనాత్మకంగా మారుతాయి. ఆమె నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే మగ వాళ్ళు చేసే అరాచకాల మీద నిత్యం గొంతు ఎత్తుతూ ఉంటుంది. ఇక ఆడవాళ్లు వేధింపులకు గురయ్యే అంశాల గురించి ఎప్పుడూ చర్చిస్తూ వారికి అండగా నిలబడుతుంది.
కొంతమంది మహిళలు కూడా ఆమెకు పర్సనల్‌గా తమ గొడును చెప్పుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పెట్టింది. అలాగే దానిపై చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతున్నాయి. ఓ బస్సులో ఓ వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనుచితంగా టచ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పెట్టి చిన్మయి ‘‘ఇండియాలోని ట్రావెల్ సిస్టం ఇలానే ఉంటుంది. అందుకే మీ అమ్మాయిలకు, కూతుళ్లకు ఓ స్కూటీ కొనివ్వండి.. అదే వారికి సురక్షితం. ప్రతీ చోటా ఇలాంటి వాళ్లున్నారు.. ఎక్కడా రక్షణ ఉండటం లేదు.
టెంపుల్స్‌లో క్యూలోనూ ఇలానే ఉంటుంది.. మహాకుంభమేళ(Mahakumbha Mela)లో చూస్తున్నారు కదా ఎలా ఉందో.. బస్సు, ట్రైన్, ఫ్లైట్ ఇలా అన్ని చోట్లా ఇలానే ఉంటోంది.. అందులో ఉన్న అమ్మాయి చున్నీ వేసుకుంది.. దుపట్టా ఉంది.. అయినా కూడా అలా ప్రవర్తిస్తున్నాడు.. మీమ్స్ చేసే వాళ్ళు ఇది చూడండి.. అక్కడ అతని బుద్ధి వంకర గా ఉంది. మగాళ్లంతా ఇంట్లోనే ఉంటేనే ఆడవాళ్లు బయట సురక్షితంగా ఉంటారు.. ఒక వేళ ఆడవాళ్లు ఇంటికి సురక్షితంగా తిరిగి వచ్చినా కూడా ఇంట్లోనే వేధించే వాళ్ళు కూడా ఉండొచ్చు’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు ‘బ్యాడ్ గర్ల్’(Bad girl) మూవీ టీజర్‌ను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ సెన్సేషనల్‌గా మారింది.