వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో.. దుమారం రేపుతున్న రాజేంద్రప్రసాద్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-12-11 06:33:16.0  )
వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో.. దుమారం రేపుతున్న రాజేంద్రప్రసాద్ కామెంట్స్
X

దిశ, సినిమా: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌(Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ ‘హరికథ’ (Harikatha). దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తుండగా.. మ్యాగీ(Maggie) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దివి(Divi), పూజిత పొన్నాడ(Poojitha Ponnada), రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), శ్రీరామ్(Sriram), మౌనిక రెడ్డి(Mounika Reddy), అర్జున్ అంబటి(Arjun Ambati) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇది ఈ నెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అందుబాటులోకి రాబోతుంది. ఈ క్రమంలో.. మేకర్స్ సోమవారం ‘హరికథ’ సిరీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో.. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం, వాడెవడో చందనం దొంగ, వాడు హీరో. హీరోల్లో మీనింగ్ మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌తో డిఫరెంట్ హీరో అనిపించుకున్నాను” అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ‘పుష్ప 2’ మూవీని ఉద్దేశించే నట కిరీటి ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

Next Story

Most Viewed