సాయి పల్లవికి బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-02-01 12:34:39.0  )
సాయి పల్లవికి బెడ్ రెస్ట్  అవసరమన్న వైద్యులు.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ ‘ప్రేమమ్’ మూవీతో సినీ ఇండస్ట్రీ(Tollywood Industry)కి పరిచయమైంది. ఆ తర్వాత ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, NGK, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం అమరన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ నటనతోనే కాదు డాన్స్ తో కూడా అభిమానులకు ఆకట్టుకుంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘తండేల్’ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య(Hero Naga Chaitanya) సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా(Movie) ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రజెంట్ ఈ సినిమా ప్రొమోషన్లతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే ప్రొమోషన్లలో భాగంగా ముంబయిలో జరిగిన ‘తండేల్’ ట్రైలర్ విడుదల(Trailer Release) కార్యక్రమానికి నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి(Director Chandu Mondeti), నిర్మాత అల్లు అరవింద్ మాత్రమే పాల్గొన్నారు. ఆ వేడుకలో సాయి పల్లవి పాల్గొనలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. అయితే ఆమె ఆ ఈవెంట్‌లో పాల్గొనకపోవడం పై తాజాగా దర్శకుడు చందూ మొండేలి స్పందించారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాయిపల్లవి అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. సాయిపల్లవి(Sai Pallavi) కొన్ని రోజుల నుంచి జ్వరం(Fever), జలుబు(Cold)తో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆమె సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ తరుణంలో సాయిపల్లవి మరింత నీరసించారని పేర్కొన్నారు. అయితే వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. అందుకే ఆమె ముంబై(Mumbai) వేదికగా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని స్పష్టం చేశారు.


Next Story