- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎవర్రా మీరంతా.. ఇకనైనా మీ మైండ్‌సెట్ మార్చుకోండి.. విజయశాంతి స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, సినిమా: చాలా గ్యాప్ తర్వాత ఓ పవర్ ఫుల్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanthi). నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son of Vyjayanthi). ఇందులో విజయశాంతి కళ్యాణ్ రామ్‌కి తల్లి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. అంతే కాకుండా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఈ లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించగా... భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరుస ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు చిత్ర బృందం.
ఇందులో భాగంగా తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ సినిమా గురించి కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు అదేం శాడిజమో నాకు అర్థం కావడం లేదు. ఏ సినిమాకు అయినా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి.. అంత కష్టపడి చేస్తున్న హీరోలకు, డైరెక్టర్లకు, టెక్నిషియన్స్‌కు ఇలాంటి నెగిటివిటీ అసౌకర్యం కల్పించినట్లు అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. వాంటెడ్‌గా కొన్ని చేస్తున్నారు నేను చూస్తున్నాను.. వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం. ఏ సినిమాను డిస్టబ్ చేయకూడదు. బాగున్నది బాగోలేదు అని ప్రచారం చెయ్యకూడదు.
ఎవరెవరూ ఇలాంటి తప్పులు చేస్తున్నారో వారు కొంచెం మైండ్‌సెట్ మార్చుకోండి. మా లాంటి దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన నటులు నెగిటివిటీని ఎదుర్కోగలరు. కానీ చిన్న చిన్న అడుగులు వేస్తున్న యువకులు.. వారు కెరీర్లే ప్రభావితమవుతాయి. సినిమా పరిశ్రమ మనుగడ సాగించనివ్వండి. ప్రతికూలతను వ్యాప్తి చేసే వ్యక్తులకు ఇది నా నుండి ఒక స్పష్టమైన హెచ్చరిక. సినిమాను ఖూనీ చేద్దామనుకునే దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నారు కదా వాళ్లకు ఇదే నా వార్నింగ్.. దయచేసి ఇక ఇలాంటివి ఆపండి. థియేటర్‌లో సినిమా చూసిన ప్రజలు బాగుందని పాజిటివ్‌గా చెప్తున్నారు. కానీ మీలాంటి వాళ్లు కావాలనే ఇలా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది విజయశాంతి.