Vijay Sethupathi: విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్ ఫిక్స్.. అప్పుడు స్టార్ట్ అయిన ట్రోల్స్!

by sudharani |
Vijay Sethupathi: విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్ ఫిక్స్.. అప్పుడు స్టార్ట్ అయిన ట్రోల్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath), తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ (Charmi Kaur) నిర్మిస్తున్నారు. ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు (Tabu) కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. హీరోయిన్‌గా రాధిక ఆప్టే (Radhika Apte) ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇలా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన అనేక ముచ్చట్లు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ టైటిల్ (Title) ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పూరీ, విజయ్ కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘బెగ్గర్’ (Beggar)అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు నెట్టింట ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. అయితే.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ‘ఈ సినిమాకు ఆడియన్స్‌గా కూడా మీరే వెళ్లాలి ఇంకెవరు రారు’ అంటూ అప్పుడే ట్రోల్స్ స్టార్ట్ చేశారు కొందరు నెటిజన్లు.






Next Story

Most Viewed