Vidaamuyarchi Trailer: ‘విదాముయార్చి’ ట్రైలర్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్

by Kavitha |
Vidaamuyarchi Trailer: ‘విదాముయార్చి’ ట్రైలర్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), మాగిజ్ తిరుమేని(Magizh Thirumeni) కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘విదాముయార్చి’(Vidaamuyarchi). ఇందులో స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీనిని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24H రేసింగ్‌లో మెడల్ సాధించిన అజిత్ తాను నటించిన సినిమా ఈ జనవరిలో విడుదల కానుంది అని ప్రకటించాడు. దీంతో విదాముయార్చి జనవరి 26న రిలీజ్ అవుతుందని సినీ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చినా గ్లింమ్స్‌(Glimps)కు మంచి స్పందన లభించగా.. తాజాగా విదాముయార్చి ట్రైలర్‌(Trailer)ను నేడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెలలోనే ఈ మూవీ రిలీజ్ చేస్తారా లేదా ఫిబ్రవరికి మరోసారి పోస్ట్‌పోన్ చేస్తారో నేడు రిలీజ్ కానున్న ట్రైలర్‌లో ప్రకటిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed