ఉల్లి పొరలాంటి చీరలో దర్శనమిచ్చిన వెంకీ హీరోయిన్.. తలైవీ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
ఉల్లి పొరలాంటి చీరలో దర్శనమిచ్చిన వెంకీ హీరోయిన్.. తలైవీ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘రాంబంటు’(Rambantu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ భామకు తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఫేమ్ ఉంది. ఇక రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాలో వెంకటేష్(Venkatesh) భార్య క్యారెక్టర్ పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అయితే ఈ సినిమాలో ఈ భామ నటనకు ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘కరుప్పర్ నగరం’(తమిళ్), ‘మోహన్ దాస్’(తమిళ్), ‘తీయవర్ కులైగల్ నడుంగ’(తమిళ్), ‘ఉత్తరకాండ’(కన్నడ) వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. ఐశ్వర్య ఓ పక్కా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్య రాజేష్ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గోల్డ్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు తలైవీ, సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed