కంటీన్యూగా బాక్సీఫీస్‌ను షేక్ చేస్తున్న వెంకీమామ.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే..?

by Kavitha |   ( Updated:2025-02-03 11:41:39.0  )
కంటీన్యూగా బాక్సీఫీస్‌ను షేక్ చేస్తున్న వెంకీమామ.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే..?
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), శిరీష్(Shirish) రూపొందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో వీకే నరేష్(VK Naresh), వీటి గణేష్(VT Ganesh), సాయి కుమార్(Sai Kumar), పమ్మి సాయి(Pammi Sai), సర్వదమన్ బెనర్జీ(Sarwadam Banerjee) తదితరులు నటించారు.

అయితే ఈ చిత్రం సంక్రాంతి(Pongal) కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయి స్టార్టింగ్ డే నుంచి కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ మరో రికార్డు బ్రేక్ చేసింది. ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ కొట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ పోస్ట్ పెట్టారు. ‘సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ఫర్ రీజినల్ ఫిల్మ్’ అంటూ ఈ మూవీ రూ.303 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వెంకీ మామ సినిమా అంటే ఆ మాత్రం షేక్ ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబోలో వచ్చిన ఎఫ్-2(F-2), ఎఫ్-3(F-3) మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి హిట్స్‌గా నిలవడం విశేషం.

Next Story

Most Viewed