- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sankranti King: బాలయ్యకు బిగ్ షాక్... 72 గంటల్లోనే రికార్డులు బద్ధలు..!

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమా విడుదలై తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాలయ్య సినిమాకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ నెల 12 నుంచి థియేటర్లలో ఈ సినిమా శివతాండవం చేసింది.
అయితే సంక్రాంతి(Sankranti) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankrantiki Vastunnam) సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో వెంకటేశ్(Venkatesh) నటనకు ఫిదా అయ్యారు. దీంతో థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. అయితే బాలయ్య సినిమాకు రూ.105 కోట్లు రాబట్టడానికి నాలుగు రోజులు పట్టింది. కానీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి మూడు రోజుల్లో రూ. 106 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాను ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బీట్ చేసిందని ప్రేక్షకులు అంటున్నారు. రెండు సినిమాలు హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.