- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘వార్-2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెండు ఇండస్ట్రీలు షేక్ కావడం ఖాయం అంటున్న నెటిజన్లు! (ట్వీట్)

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ అక్కడ కూడా సత్తా చాటుతున్నారు. అలాగే హిందీ హీరోలు కూడా అదే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హృతిక్(Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మల్టీస్టారర్ మూవీ ‘వార్-2’. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వార్-2’ సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘వార్-2’కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానుల ఆనందానికి కారణం అవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఓ క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇక ఈ పాటలో ఏకంగా 500 మంది డ్యాన్సర్లు కూడా చిందులేయనున్న టు టాక్. రెగ్యులర్ డ్యాన్స్ కాకుండా స్పెషల్‌గా ఉండేలా యష్‌రాజ్ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు షేక్ అవడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.
#War2 :
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 4, 2025
Reports indicate #Hrithik Roshan and #JrNTR are shooting a lavish Dance-off choreographed by Bosco Martis with 500+ background artistes at Yash Raj Studios in Mumbai.
Pritam composed this song being seen as a dance battle that leads to the climax fight! pic.twitter.com/ODDk7ra0KI