Chiranjeevi Vishwambhara: 'విశ్వంభర' నుంచి ఆసక్తికర అప్ డేట్

by D.Reddy |   ( Updated:2025-01-28 07:15:49.0  )
Chiranjeevi Vishwambhara: విశ్వంభర నుంచి ఆసక్తికర అప్ డేట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వశిష్ట సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ అందించారు. సినిమాలోని మ్యూజిక్ పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ.. చిరంజీవి, కీరవాణి, చంద్రబోస్‌లతో దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్భుతమైన మ్యూజిక్ అందించినందుకు కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం మేకర్స్ 13 భారీ సెట్లతో ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ మూవీని మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండస్ట్రీలో ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఇదే తేదీన విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', వెంకటేశ్‌ హీరోగా వచ్చిన 'ప్రేమించుకుందాం..రా', నాగార్జున నటించిన 'సంతోషం'తో పాటు అగ్ర హీరోలు నటించిన ఎన్నో సినిమాలు మే 9న విడుదలై వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో ఆ తేదీన మూవీ రిలీజైతే హిట్‌ కొట్టినట్టే అనేది ఓ సెంటిమెంట్‌గా మారింది.

Next Story

Most Viewed