Tripti Dimri: మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్‌లో టాప్‌-1 త్రిప్తి డిమ్రి.. సమంత, శోభితల స్థానం ఎంతంటే

by sudharani |
Tripti Dimri: మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్‌లో టాప్‌-1 త్రిప్తి డిమ్రి.. సమంత, శోభితల స్థానం ఎంతంటే
X

దిశ, సినిమా: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDB) సంస్థ ప్రతి ఏడాది మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన మోస్ట్ పాపులర్ నటీనటుల లిస్ట్ విడుదల చెయ్యగా.. అందులో టాప్ 1 లో త్రిప్తి డిమ్రి (Tripti Dimri) నిలిచింది. ఈ ఏడాది ‘బ్యాడ్ న్యూజ్, లైలా మజ్ను, భూల్ భులయ్యా 3’ వంటి చిత్రాలు రిలీజ్ కావడంతో త్రిప్తి గురించి ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. సెకండ్ ప్లేస్‌లో దీపికా పదుకొణె (Deepika Padukone), మూడునాలుగు స్థానాల్లో నటుడు ఇషాన్ ఖత్తర్ (Ishan Khattar), బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan) ఉండగా.. టాప్ 5లో శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala) నిలిచింది. ఇక 6, 7 లో శార్వరీ (Sharvari), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఉండగా.. ఎనిమిదో ప్లేస్ సమంత (Samantha) దక్కించుకుంది. తర్వాత స్థానంలో అలియా భట్ (Alia Bhatt).. టాప్ 10లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఉన్నాడు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించినట్లు సదరు సంస్థ తెలిపింది.

Next Story

Most Viewed