సింపుల్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్

by Kavitha |
సింపుల్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెరపై మెప్పించి ఆ తర్వాత దుల్కర్ సల్మాన్(Dulquer salmaan) నటించిన "సీతారామం"(Seetharamam) సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం అయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. సంప్రదాయ లుక్‌లో కనిపించి మెప్పించేసరికి ఈ భామను అందరూ తెలుగమ్మాయి లానే ఆదరించారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొన్నేళ్లలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌లో ఫేమ్ తెచ్చేసుకుంది.

ఇక అక్కడ నుంచి కేవలం మూడు సినిమాల్లోనే కనిపిస్తే అందులో ఒకటి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇలా తెలుగులో ఉన్న కొన్ని ఏళ్ళు ఫుల్ బిజీ అయ్యింది కానీ ‘ది ఫ్యామిలీ స్టార్’(Family Star) ప్లాప్ సినిమాతో నెమ్మదించింది. దీంతో మళ్ళీ బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇక తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు అనే సమయంలో మరో సినిమా అనౌన్స్ చేసింది. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో యంగ్ హీరో అడివి శేష్(Adivishesh) సరసన క్రేజీ థ్రిల్లర్ ‘డెకాయిట్’ లో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ పెట్టింది మృణాల్. అందులో బ్లాక్ ప్యాంట్ వైట్ స్లీవ్ లెస్ టీ షర్ట్‌తో సింపుల్ లుక్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా వాటిని బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed