- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ చూసిన టాలీవుడ్ హీరో.. కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగ పోస్ట్

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు(Jagapathi Babu), రావు రమేష్(Rao Ramesh), జగదీష్, సునీల్, అనసూయ(Anasuya), ఫాహద్ ఫాజల్ కీలక పాత్రలో కనిపించారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’కు సీక్వెల్‌గా వచ్చి డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చింది.
మొదటి షో నంచి ‘పుష్ప-2’ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్‌లోనూ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ రీ లోడెడ్ వెర్షన్ జోడించడంతో ‘పుష్ప-2’ ప్లస్ పాయింట్‌గా మారింది.
కలెక్షన్లు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా జనవరి 30న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినీ సెలబ్రిటీలు మనసులు గెలుచుకుంటోంది. తాజాగా, ‘పుష్ప-2’ రీ లోడెడ్ వెర్షన్‌ను చూసిన మెగా హీరో అల్లు శిరీష్ (Allu Sirish)చూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ చూశాను. కన్నీళ్లు వచ్చాయి. థియేట్రికల్ వెర్షన్‌లో తప్పిపోయిన అన్ని లింకులు ఇక్కడ కలర్ చేశారు’’ అని రాసుకొచ్చారు. అలాగే ‘పుష్ప-2’ ఓ ఎమోషనల్ సీన్‌ను షేర్ చేశారు.