Telugu Producer: కోరికలు తీరిస్తేనే ఛాన్సులు అనే కామెంట్స్ సరికాదు

by Gantepaka Srikanth |
Telugu Producer: కోరికలు తీరిస్తేనే ఛాన్సులు అనే కామెంట్స్ సరికాదు
X

దిశ, వెబ్‌డెస్క్: దంగల్ సినిమా(Dangal Movie)తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ఫాతిమా సనా షేక్(Actress Fatima Sana Shaikh) తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్‌ ప్రారంభంలోనే క్యాస్టింగ్‌ కౌచ్‌(Casting Couch)ను ఎదుర్కొన్నానని అన్నారు. ఓ సినిమా విషయంలో హైదరాబాద్‌‌కు వచ్చినప్పుడు ప్రముఖ నిర్మాత మాటలు తనను చాలా బాధ పెట్టాయని ఆరోపించారు. ఆయన నాతో అనుచితంగా ప్రవర్తించారు. టాలీవుడ్‌లో మీరు రాణించాలన్నా, అవకాశాలు రావాలన్నా అన్నింటికి సిద్ధంగా ఉండాలి.. ఏ పని అయినా చేయాలి’ అని అన్నారని తెలిపారు.


క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఆ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. దీంతో భయమేసి వెనుదిరిగి వచ్చేశానని ఫాతిమా చెప్పుకొచ్చారు. తాజాగా.. ఫాతిమా మాటలపై టాలీవుడ్ నిర్మాత ముత్యాల రాందాస్(Producer Muthyala Ramdas) స్పందించారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనేది తప్పుడు ప్రచారం. నిర్మాతల కోరికలు తీరిస్తేనే ఛాన్సులు అంటూ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కమిటీలు కూడా వేశాం. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. అసలు ఇదంతా కాదు.. కమిట్‌మెంట్ అడిగినప్పుడే ఎందుకు చెప్పుతో కొట్టలేదు’ అని రాందాస్ ప్రశ్నించారు.

అనంతరం నట్టి కమార్(Natti Kumar) మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీపై అభాండాలు వేయడం సరికాదని అన్నారు. ఆరోపణలు కాదు.. దమ్ముంటే పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కమిట్‌మెంట్ అడిగిన నిర్మాతపై ఫిర్యాదు చేయకుండా కామెంట్స్ చేయడమేంటని ఫైర్ అయ్యారు. కాగా, తెలుగులో ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ అనే చిత్రంలో ఫాతిమా సనా షేక్ నటించారు.


Next Story

Most Viewed