ఊహించని నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ బ్యూటీ.. చేతులారా కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నావంటున్న ఫ్యాన్స్

by Kavitha |
ఊహించని నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ బ్యూటీ.. చేతులారా కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నావంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’(Uppena) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. బేబమ్మ(Bebamma) క్యారెక్టర్ కుర్రాళ్ల మనసులో ఇప్పటికీ చెరగని ఒక పేరంటే ఏమాత్రం అతియోశక్తి లేదు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singa Roy), ‘బంగార్రాజు’(Bangarraju), ‘ఆ అమ్మాయి గురించి మీకు తెలుసా’(aa Ammai Gurinchi Meeku Telusa), ‘ది వారియర్’(The Warrior), ‘మాచర్ల నియోజకవర్గం’(MaCherla Niyojakavargam), ‘కస్టడీ’(Custody), ‘మనమే’(Maname) వంటి సినిమాల్లో నటించింది.

అయితే చివరగా నటించిన చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పి కోలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

కృతి శెట్టి ప్రజెంట్ బాలీవుడ్(BollyWood) ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ క్యారెక్టర్‌కి అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈ బ్యూటీ ఒక ఐటెం సాంగ్‌లో చిందులు వేయడానికి ఓకే చెప్పిందట. అయితే సాధారణంగా ఒక యంగ్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే మళ్లీ హీరోయిన్‌గా చాన్స్‌లు రావడం కష్టమన్న సంగతి మనకు తెలిసిందే. అందులోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో సాంగ్ అంటే ఆలోచించాల్సిన విషయమనే చెప్పాలి.

ఇక కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు కృతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంచెం రిస్క్ అనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ చేతులారా కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed