సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Hamsa |
సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ‘బేబీ’(Baby) సినిమాతో ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. 2023లో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో వైష్ణవి క్రేజ్ భారీ పెరిగిపోయిందనడంతో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య ‘జాక్’(Jack) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bhaskar)తెరకెక్కిస్తున్నారు.

దీనిని బీవీఎస్‌ఎన్స్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. ప్రకాష్ రాజ్(Prakash Raj), నరేష్, బ్రహ్మాజీ(Brahmaji) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే వైష్ణవి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, ఈ భామ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె పూల చీరలో, తలలో రెడ్ గులాభి పెట్టుకుని దర్శనమిచ్చింది. కాటుక కళ్ళతో అదిరిపోయే స్టిల్స్‌తో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు గార్జియస్, ఫ్యాబులస్, క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అని కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed