- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)అందరికీ సుపరిచితమే. ‘ఆర్ఎక్స్ 100’(RX 100) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఆమె తన అందం, నటనతో మొదటి చిత్రంతోనే ఊహించని విధంగా క్రేజ్‌కు సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా ఆ ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమాలో నటించింది. అలా తీస్ మార్ ఖాన్, డిస్కో రాజా అనగనగా ఓ అతిథి, జిన్నా, రక్షణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక 2023లో పాయల్ నటించిన ‘మంగళవారం’(Mangalavaaram) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘వెంకట లచ్చిమి’ (Venkata Lachmi)సినిమాలో నటిస్తోంది. ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏకంగా ఆరు భాషల్లో విడుదల కాబోతుంది. పాయల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. వరుస ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఈ అమ్మడు నటించిన ‘మంగళవారం’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నట్లు తెలుపుతూ పలు ఫొటోలు షేర్ చేసింది. ‘మంగళవారం’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును నేను గర్వంగా అంగీకరించినందుకు ఈరోజు ఒక అందమైన సందర్భం నా పనిని గుర్తించి. నాకు ఈ అపురూపమైన గౌరవాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నాకే కాదు, ఇది ప్రతి చోట మహిళల స్ఫూర్తి, విజయాలను జరుపుకుంటుంది. ఒకరినొకరు ఉద్ధరించుకుంటూ, స్ఫూర్తిని పొందుతూనే ఉంటాం’’ అనే క్యాప్షన్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.