Ram Charan: అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్‌గా రామ్ చరణ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-01-18 16:12:10.0  )
Ram Charan: అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్‌గా రామ్ చరణ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game changer) సినిమా సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్టింగ్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. విడుదల రోజే HD ప్రింట్ (HD Print) బయటకు రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. అయితే.. ‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ (Unstoppable Season 4)కు హాజరైన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకోగా.. మొదటి భాగం.. ‘గేమ్ చేంజర్’ రిలీజ్ సమయంలో విడుదల చేశారు. ఇక తాజాగా రెండో భాగాన్ని విడుదల చేశారు.

ఇందులో భాగంగా.. బాలయ్య చరణ్‌ను ‘ఫెయిల్యూర్స్ (Failures) వస్తే వాటిని ఎలా తీసుకుంటావు? అని అడుగుతారు. దీనిపై స్పందించిన రామ్ చరణ్.. ‘జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సందర్భం ఒక పాఠం నేర్పుతుంది. మనకు జరిగిన దానిలో తప్పులను గుర్తించి వాటిని సరిచేసుకొని ముందుకు వెళుతుండాలి. అలాగే ఆ తప్పును మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇక ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఆ టైమ్ మనది కాదు అనుకోవాలి. ఇక మిగిలిన అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ రామ్ చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Read More..

Megastar Chiranjeevi: పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది.. చిరంజీవి ట్వీట్‌పై తమన...

Next Story