- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న సూర్య.. నిజంగా అలా అనిపించిందంటూ షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) తెరకెక్కిస్తుండగా.. జోజు జార్జ్, జయరామ్(Jayaram), కరుణాకర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దీనిని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ (Santosh Narayan)సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సూర్య సరసన పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) దక్కించుకుంది.
షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘రెట్రో’ మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘చెన్నైలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ‘రెట్రో’ కోసం పెద్ద జైలు సెట్ ఏర్పాటు చేశారు. అయితే అందులోనే లైబ్రరీ, వంటగది, అన్నిటినీ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో ఐదు రోజులు ఓ పాట షూట్ చేశాం. ఆ ఐదు రోజులు నాకు నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది. ఆ పాటలో డ్యాన్స్ మూమెంట్స్ చాలా బాగుంటాయి. అలాగే ‘రెట్రో’ చిత్రంలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.