- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Robinhood: ది హాటెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్.. పోస్టర్‌తోనే హీట్ పెంచేస్తున్న చిత్ర బృందం

దిశ, సినిమా: హీరో నితిన్ (Nitin) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ (Highly Anticipated) హీస్ట్ కామెడీ సినిమా ‘రాబిన్‌హుడ్’ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘రాబిన్‌హుడ్’ నుంచి వచ్చిన రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈరోజు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ (Third single) అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ది హాటెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ది ఇయర్’ గా సిజ్లింగ్ దివా కేతికా శర్మ (Ketika Sharma) నటించిన స్పెషల్ సాంగ్ (Special song) మార్చి 10న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సాంగ్‌లో కేతికా శర్మ అల్ట్రా గ్లామరస్‌గా కనిపించనుందని తెలుస్తుండగా.. ఇది ప్రేక్షకులను, సంగీత ప్రియులను సర్ ప్రైజ్ చేయబోతోందని అర్థం అవుతోంది. అలాగే ది హాటెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా ఈ పాట ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. కాగా.. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.