Tollywood : రాజమౌళి తో మూవీ తర్వాత డిజాస్టర్ కొట్టిన స్టార్ హీరోస్ వీళ్ళే .. అతనికైతే అన్ని ఎదురు దెబ్బలే..!

by Prasanna |
Tollywood : రాజమౌళి తో మూవీ తర్వాత డిజాస్టర్ కొట్టిన స్టార్ హీరోస్ వీళ్ళే .. అతనికైతే అన్ని ఎదురు దెబ్బలే..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు సాటి ఎవరూ లేరు .. సినిమా రావడానికి కొంచం ఆలస్యమవుతుందేమో కానీ, వస్తే పక్కా హిట్ కొట్టినట్టే .. ఆయన మరెవరో కాదు ఎస్.ఎస్.రాజమౌళి ( S.S. Rajamouli) అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఇప్పుడు, ప్రపంచ దేశాలు తెలుగు ఇండస్ట్రీ వైపు చుస్తున్నాయంటే కారణం .. రాజమౌళినే. తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన డైరెక్టర్ జక్కన్న. ఆయన తీసిన ప్రతి మూవీ సూపర్ హిట్ అయింది. చిన్న హీరోలను కూడా పాన్ ఇండియా స్టార్ లాగా మార్చిన ఘనత ఆయనకే చెందుతుంది. కాకపోతే, ఆయనతో మూవీ తర్వాత, చేసే ప్రతి మూవీ ఫ్లాప్ గా నిలుస్తుంది. ఈ సెంటిమెంట్ స్టార్ హీరోస్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. ఎన్టీఆర్ ( Jr. NTR)

" స్టూడెంట్ నెంబర్ వన్ " మూవీతో రాజమౌళి, ఎన్టీఆర్ కు సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన " సుబ్బు " చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

2. నితిన్ ( Nithin)

రాజమౌళి దర్శకత్వం వహించిన నితిన్ హీరోగా తెరకెక్కిన “సై” హిట్ అవ్వగా, ఆ మూవీ తర్వాత నితిన్ “అల్లరి బుల్లోడు” అట్టర్ ఫ్లాప్ అయింది.

3. ప్రభాస్ ( Prabhas)

" ఛత్రపతి " మూవీ రాజమౌళి డైరెక్షన్ లో రాగా పెద్ద విజయం సాధించింది. ఆ సమయంలోనే వచ్చిన " పౌర్ణమి " సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

4. రవితేజ ( Raviteja)

రవితేజ " విక్రమార్కుడు " మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత వచ్చిన " ఖతర్నాక్ " సినిమా మాత్రం బిగెస్ట్ డిజాస్టర్ అయింది.

5. రామ్ చరణ్ ( Ramcharan)

జక్కన్న డైరెక్షన్ లో " మగధీర " మూవీతో రామ్ చరణ్ హిట్ అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం ప్లాప్ అయింది.

6. నాని ( Nani )

" ఈగ " మూవీతో పెద్ద హిట్ అందుకున్న నాని ఆ తర్వాత “ఎటో వెళ్ళిపోయింది మనసు” తో నాని ఖాతాలో డిజాస్టర్ పడింది.

7. ప్రభాస్ ( Prabhas)

ప్రభాస్ హీరోగా వచ్చిన " బాహుబలి 1, 2 " ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత ప్రభాస్ " సాహో " విమర్శలు ఎదుర్కొని బోల్తా పడింది.

8. రామ్ చరణ్ ( Ramcharan)

" ఆర్ఆర్ఆర్ " తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ " ఆచార్య " మూవీతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed